లక్ష్మి దేవి మీ దగ్గరే ఉండాలంటే డబ్బులు ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో తెలుసుకోండి.

లక్ష్మి దేవి మీ దగ్గరే ఉండాలంటే డబ్బులు ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో  తెలుసుకోండి.



ధనం ఇదం మూలం జగత్ అన్నారు పెద్దలు …జీవితం లో కొన్నింటిని డబ్బు తో కొనలేము.. అవి ప్రేమ అనురాగం ఆప్యాయత కానీ మనిషి అవసరాలు తీరాలంటే మాత్రం మనీ చాల అవసరం… డబ్బు ఊరికీ ఎవ్వరికి రాదు నెల అంత కష్ట పడి పనిచేస్తే వస్తుంది..మరి ఇంత పని చేసిన చేతి లో ఒక్క రూపాయి కూడా మిగలదు.. ఎదో ఒక రూపం లో ఖర్చు అయిపోతుంది.. ముందుగా ఎక్కడ కర్చు ఎక్కువగా చేస్తున్నామో తెలుసుకోవాలి వాటిని మెల్ల మెల్లగా తగ్గించుకొనే ప్రయత్నం చెయ్యాలి దాంతో పాటుగా మన చేతిలో ఉన్న డబ్బుల మన జాగ్రతగా కాపాడుకోవాలి ..


చేతిలో ఉన్న పర్స్ తీసి ఎక్కడంటే అక్కడ పెట్ట కూడదు.జొబ్ లో ఉన్న డబ్బులు తీసి టేబుల్ మీద ఎక్కడ పడితే అక్కడ అసలు పెట్టకూడదు .. మరి ముఖ్యంగా ఆడవారు పోపుల డబ్బాలో చిల్లర దాచిపెడుతూ ఉంటారు ఇలా డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టడం మంచి కాదు అంటున్నారు పండితులు ..


ఇలా దనం విషయం లో నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట. ప్రతీ వస్తువుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టె అలవాటు ఉంటె ఇలాంటి సమస్యలు అసలు రావు . కొందరైతే మరీనూ పూజ సామాను తీసుకువచ్చి మంచం మీద, లేక టేబుల్ కనిపించింది కదా అని తినే టేబుల్ మీద పెడతారు. అలా అస్సలు పెట్టకూడదు. అలా పెట్టడం వలన మంచి జరగకపోగా నష్టాలు వస్తాయని చెబుతున్నారు .. మరి ఇంట్లో ధనాన్ని ఎక్కడ పెట్టాలి అని విషయాన్ని తెలుసుకుందాం ..


ఇంట్లో తూర్పు దిశా గా లాకర్ పెట్టుకోవచ్చు .. పశ్చిమ దిశగా బంగారం పెట్టుకోవచ్చు . ఇక లాకర్లు ఉత్తరం ముఖం తెరుచుకొనే దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తెస్తుంది .ఇక దక్షిణం పై ధనం పెట్ట పోవడం మంచిది ..ఉపయోగిందే లాకర్లు లో దుమ్ము దులి లేకుండా చూసుకోవాలి ఒక వేళా అలా ఉన్నట్లయితే వెంటనే శుబ్రపరచుకోవాలి . అప్పుడే లక్ష్మి దేవి ఇంటినుండి వెళ్ళిపోకుండా ఉంటుంది .. ఇక కొందరు బీరువాలో లక్ష్మి అమ్మవారి ప్రతిమను పెట్టుకుంటారు ఇలా అమ్మవారు ఒక్కరే కాకుండా .. రెండు గజములు కలిగిన లక్ష్మి అమ్మవారి ప్రతి మను పెట్టుకుంటే మంచింది..

ఎంత కష్ట పడిన ఇంట్లో ధనం నిల్వ ఉండకపోవడానికి కారణం మరోక విషయం కూడా అది ఇంట్లో రాత్రి నిద్రపోయే ముందు ఇంటి లోపల దీపాలు అన్ని అర్పి వెయ్యకూడదు .. కనీసం ఒక్క దీపం అయిన వెలగాలి ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.. ఇక లివింగ్ రూమ్ లో అక్వేరియం పెట్టుకోవడం వల్ల సంపద వృద్ది చెందుతుంది .. ఐతే దీనిని గదిలోని నైరుతి దిక్కున ఉంచుకోవాలి.

మరి ముఖ్యంగా ఇంటికి తలుపులు గాజు వి ఐతే వాటి ఎప్పుడు కూడా పరిశుబ్రంగా ఉంచుకోవాలి .. ఒక వేళా ఇవి మురికిగా ఉంటె సంపదను లోపలి రానివ్వడదు అని పెద్దలు చెబుతున్నారు .. ఇకఇంటికి నైరుతి ములను కుబేర స్థానం అంటారు తమిలియన్ లు ఐతే ఇక్కడ భూమి లోపల సంప్ కానీ , బోర్ వెల్ కానీ , సెప్టిక్ ట్యాంక్ కానీ లేకుండా చూసుకుంటే ఇంట్లో ధనం నిలుస్తుంది అభివృద్ధి కూడా జరుగుతుంది.

తెలిసిందిగా యింక డబ్బులు ఉంచవలసిన ప్రదేశాలలో ఉంచి లక్ష్మి దేవిని మీ తోనే ఉండేలా చేసుకోండి. 
Share:

కళ్ళ క్రింద నల్ల మచ్చలను తొలగించే సింపుల్ చిట్కా

కళ్ళ క్రింద నల్ల మచ్చలను  తొలగించే సింపుల్ చిట్కా



కళ్ళ కింద నల్ల మచ్చలను తొలగించడానికి ఉపయోగపడేదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.చింతపండు మనందరికీ తెలిసిందే రోజు మనం చింతపండు ను ఉపయోగించి ఎన్నో వంటలు పచ్చళ్ళు ఇతర వంటకాలు చేస్తూ ఉంటాం. కానీ కళ్ళ కింద ఉండే నల్ల మచ్చలను తొలగించడానికి చింతపండును ఎలా ఉపయోగించాలో దాని గుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చింతపండు కొద్దిగా క్షార గుణం కలిగి ఉంటుంది, కాబట్టి పులిత్రేనుపులకు, కడుపు ఉబ్బరంతో కూడిన జ్వరం, వికారం, విదాహము మొదలైన రోగాలకు ఔషధంగా వాడుతారు. ఆరుచెంచాల చింతపండురసం ఉదయమే సేవిస్తే ఆకలి కలిగిస్తుంది. వాపులకు, నొప్పులకు చింతపండు రసం, ఉప్పు కలిపి మర్దనచేస్తారు. బెణుకులకు, వాపులకు చిక్కటి చింతపండు రసం ఉడికించి పూస్తే నొప్పి తగ్గుతుంది. నోటిలో చిగుళ్ళు వాచి నెత్తురు కారుతూంటే చింతపండు నోటిలో పెట్టుకుంటారు. ప్రతీసారి బోజనం అయిన తరువాత బాగా పండిన చింతపండు కొద్దిగా తింటే మంచి జీర్ణకారిగా ఉపయోగపడుతుంది.



అజీర్ణ రోగాలగు, ఆకలి మందానికి చింతపండు చికిత్స ఉపకరిస్తుంది. నాలుగైదు చుక్కలు చింతపండు రసం ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలలో కలిపితే పాలు విరిగి నీళ్ళు పైన తేరతాయి.పాలు విరగ గొట్టగా వచ్చిన తేటనీరు రోజుకు మూడు పూటలు పుచ్చుకోవాలి. ఈ పాల తేటనీటిలో పాలలో లభించే ప్రోటీనులు అన్నీ లభిస్తాయి; సులభంగా జీర్ణమవుతాయి. దీన్ని తీసుకునేటప్పుడు తేలికగా అన్నం తింటూండాలి.భారతదేశంలో దక్షిణాత్యులు ప్రతిరోజు చింతపండుతో తయారుచేసుకున్న చారు, సాంబర ు(పప్పుపులుసు) తింటారు కాబట్టి వారికి గుండెపోటు జబ్బులు, మూత్రకోశపు సమస్యలు, మూత్రకోశంలో రాళ్ళు పెరగడం మొదలైన రోగాలు చాలా అరుదు అని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.


ఇక విషయానికి వస్తే చింతపండు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ముఖంపై వచ్చే మచ్చలు,బ్లాక్ హెడ్స్ పోవటానికి సహాయపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.మొదట ముఖాన్ని ఫెస్ వాష్ తో శుభ్రం చేసుకొని చింతపండు రసాన్ని రాసి 5 నిముషాలు మసాజ్ చేస్తే వచ్చే మార్పు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కంటి కింద నల్లటి వలయాలకు చింతపండు రసం మంచి పరిష్కారం. చింతపండు రసాన్ని కంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాస్తే నల్లటి వలయాలు మాయం అవుతాయి. అయితే ఒక వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి.


చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడిగితే ముఖంపై ముడతలు పోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై మృత కణాలను తొలగించడానికి చింతపండు రసం పాలతో కలిపి స్ర్కబ్‌తో రాయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అంతే మీ ముఖం పై వచ్చే మచ్చలు నెమ్మదిగా మటుమాయం అవుతాయి…


అలాగే చింతగింజల పొడికి అపూర్వ ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక పెద్ద చెంచాడు చింతగింజల పొడి శుభ్రమైయిన నీటితో రోజుకు మూడు పర్యాయాలు పుచ్చుకుంటే ఆమశంక, జిగట విరేచనాలు నివారింపబడతాయి. అర్ధ పెద్ద చెంచాడు చింతగింజల పొడి రోజుకు రెండుసార్లు తేనే అనుపానంతో సేవిస్తే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఒక పెద్ద చెంచాడు చింతగింజల పొడి రుచికి కావలసినంత పంచదార కలిపి రాత్రిపూట భోజనానికి ముందు రెండు వారాలపాటు తీసుకుంటే వీర్యస్ధలనాన్ని నివారిస్తుంది.


చింత చిగురుతో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారు చేసుకుంటారు. దీనియందు విటమినులు ఎ సిలు, ఇనుము పుష్కలంగా లభిస్తాయి.చింతకర్ర కాల్చగా వచ్చిన చింతబొగ్గు పొడి, తగినంత ఉప్పుపటిక, పిప్పరమెంటు పూవు చేర్చి పండ్లపొడి తయారుచేస్తారు. నువ్వుల నూనెలో చింతబొగ్గుల పొడిచేర్చిన ముద్ద కాలిన పుళ్ళను శీఘ్రంగా మాంచుతుంది.

పులిత్రేపులకు, అజీర్తివల్ల కలిగే వాంతులకు ,ఇతర మత్తులకు, అజీర్ణానికి చింతపండు దివ్యౌషధము.విషపదార్ధాలు జఠరకోశంలో చేరినప్పుడు చింతపండు రసాన్ని అనేకసార్లు తాగించి కృత్రిమ వమనం చేయిస్తారు. అన్నకోశము వాచినప్పుడు చింతపండు రసంలో లవంగాలు, దాల్చిన చెక్క (లవంగపట్ట) నూరి ఆముద్దను కలిపి త్రాగిస్తారు. 10 మిల్లీలీటర్ల శుబ్రమైన నీటిలో6 గ్రాముల చింతపండు రెండుగంటలసేపు నానబెట్టి ఆ నీటిని నాలగేసి గంటలకొకసారి పుచ్చుకుంటేతాజాగా ఈ మందును చేసుకుంటూండాలి. 25 గ్రాముల చింతపండు 120 మిల్లిలీటర్ల నీటిలో ఒకగంటసేపు నానబెట్టి 6 గ్రాముల పంచదార చేర్చి ఇస్తే తలతిరగడం తగ్గుతుంది.ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి మరి.


Share:

PSV గరుడ వేగ మూవీ రివ్యూ & రేటింగ్స్

PSV గరుడ వేగ మూవీ రివ్యూ & రేటింగ్స్






చిత్రం : ‘గరుడవేగ’

నటీనటులు: రాజశేఖర్ - పూజా కుమార్ - కిషోర్ - ఆదిత్ - శ్రద్ధా దాస్ - నాజర్ - చరణ్ దీప్ - రవి వర్మ తదితరులు
ఛాయాగ్రహణం: అంజి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల - భీమ్స్
నిర్మాత: కోటేశ్వరరాజు
కథ - మాటలు: ప్రవీణ్ సత్తారు - నిరంజన్ రెడ్డి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

సీనియర్ హీరో రాజశేఖర్ గత కొన్నేళ్లలో బాగా వెనుకబడిపోయాడు. ఆయన చివరగా నటించిన ‘గడ్డం గ్యాంగ్’ దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రాజశేఖర్.. విరామం తర్వాత యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ‘గరుడవేగ’ సినిమా చేశాడు. రాజశేఖర్ మార్కెట్ స్థాయికి మించి భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో బాగానే ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చంద్రశేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఆఫీసర్. తన భార్యకు కూడా తెలియకుండా అనేక సీక్రెట్ ఆపరేషన్లలో పాల్గొంటుంటాడు. దీంతో తన భార్య అతణ్ని అపార్థం చేసుకుని విడాకులు కావాలని గొడవ పెడుతుంటుంది. ఇదిలా ఉండగానే చంద్రశేఖర్ ఓ కొత్త ముందుకు ఓ కొత్త మిషన్ వస్తుంది. హైదరాబాద్ లో ఉగ్రవాదులు భారీ బాంబు పేలుడుకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తుంది. మరి చంద్రశేఖర్ ఆ కుట్రను ఎలా ఛేదించాడు.. ఇంతకీ ఆ పేలుడు కుట్ర వెనుక ఉన్నది ఎవరు.. వాళ్ల లక్ష్యమేంటి.. వీళ్లందరినీ చంద్రశేఖర్ ఎలా పట్టుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

గత దశాబ్దంలో చెత్త చెత్త సినిమాలు చేసి మార్కెట్ కోల్పోయిన రాజశేఖర్ హీరోగా పాతిక కోట్ల సినిమా అనగానే.. ఎవరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఊరికే పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నట్లుగా అనిపించింది ఈ మాట. కానీ ‘గరుడవేగ’ టీజర్.. ట్రైలర్ చూస్తే మాత్రం ఇది తేలిగ్గా కొట్టిపారేయదగ్గ సినిమా ఏమీ కాదనిపించింది. ఐతే టీజర్.. ట్రైలర్లను అందమైన ప్యాకేజీలా తీర్చిదిద్ది.. సినిమాను తేల్చిపడేసే ఫిల్మ్ మేకర్స్ ను కూడా చాలామందిని చూశాం. కాబట్టి సినిమా ‘గరుడవేగ’ సినిమా చూసే వరకు సందేహమే. ఐతే ‘గరుడవేగ’ సినిమా చూశాక మాత్రం దీని మీద పెట్టుకున్న సందేహాలు తొలగిపోతాయి. రాజశేఖర్-ప్రవీణ్ సత్తారు కలిసి ఒక సీరియస్.. ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ అందించే ప్రయత్నం చేశారు. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమాలో చాలా వరకు ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతాడు. అక్కడక్కడా కథనం కొంత పక్కదారి పట్టడం.. నెమ్మదించడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డా.. ఓవరాల్ గా ‘గరుడవేగ’ మంచి అనుభూతినే కలిగిస్తుంది.

సన్నీ లియోన్ తో ఒక మసాలా పాట.. అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన రెండు మూడు కామెడీ సీన్స్ మినహాయిస్తే.. ‘గరుడవేగ’ ఉత్కంఠ రేకెత్తిస్తూ.. మంచి ఫ్లోతో సాగిపోతుంది. స్క్రీన్ ప్లే సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో ఒక పెద్ద స్కామ్ చుట్టూ నడిచే ఈ కథను ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చెప్పాడు ప్రవీణ్ సత్తారు. ఇంటర్వెల్ వరకు అసలు కథలోని పాయింట్ చెప్పకుండానే.. చాలా ఆసక్తికరంగా కథను నడిపించడంలో అతను విజయవంతమయ్యాడు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలోని సిబ్బంది ఎలా పని చేస్తారో.. వాళ్ల పరిశోధన తీరు ఎలా ఉంటుందో చూపిస్తూ.. ఒక కేస్ స్టడీని పెట్టి దాని చుట్టూ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది.

హీరో ఫ్యామిలీ ఇష్యూను చూపిస్తూ.. కొంచెం సుదర్ఘంగా సాగే ఆరంభ సన్నివేశం కొంచెం సాగతీతగా అనిపించినప్పటికీ.. హీరో మిషన్లోకి దిగాక కథనం రయ్యిన పరుగెడుతుంది. బాంబ్ బ్లాస్ట్ చుట్టూ కుట్రను ఛేదించే క్రమాన్ని చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు ప్రవీణ్. ఈ సన్నివేశాలు ప్రపంచ స్థాయి థ్రిల్లర్లను గుర్తుకు తెస్తాయి. బాంబు బ్లాస్ట్ మిషన్ ని బ్రేక్ చేసే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ప్రేక్షకులకు ఎమోషనల్ హై ఇస్తాయి. ఆడియన్స్ బాగా సినిమాలో లీనమయ్యేది ఇక్కడే. ఇంటర్వెల్ అయ్యేసరికి ‘గరుడవేగ’ మంచి ఫీలింగ్ ఇస్తుంది.

విరామం తర్వాత ‘గరుడవేగ’ కథలోని అసలు పాయింట్ విప్పుతాడు దర్శకుడు. కోర్ కాన్సెప్ట్ ను వివరించే సన్నివేశాలు కొంచెం గందరగోళంగా సాగినప్పటికీ.. ప్రవీణ్ ఈ కాన్సెప్ట్ విషయంలో చాలా స్టడీ చేసిన విషయం అర్థమవుతుంది. అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం ఎగుమతికి సంబంధించి స్కామ్ చుట్టూ నడిచే వ్యవహారంతో ‘గరుడవేగ’లో ఇంటర్నేషనల్ టచ్ కనిపిస్తుంది. ఈ అంశాన్ని కమర్షియల్ సినిమాల్లో మాదిరి పైపైన చూపించకుండా.. వాస్తవికంగా అనిపించేలా.. కొంచెం స్టడీ చేసి ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేశాడు.

ఐతే ఈ కాన్సెప్ట్ గురించి వివరణ అయ్యాక ‘గరుడవేగ’ కొంచెం ట్రాక్ తప్పుతుంది. కథనం నెమ్మదిస్తుంది. సన్నీ లియోన్ ఐటెం సాంగ్ మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు కానీ.. అది కూడా కథను కొంచెం పక్కదారి పట్టిస్తుంది. ఇక ఇంత పెద్ద స్కామ్ అనగానే విలన్ గురించి ఎంతో ఊహించుకుంటాం. కానీ ఆ పాత్రలో ఏ విశేషం లేదు. చివర్లో హీరో కుట్రను ఛేదించే క్రమాన్ని కూడా సింపుల్ గా తేల్చేశారు. ద్వితీయార్ధమంతటా యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. పతాక సన్నివేశంలో ఉండాల్సినంత ఉత్కంఠ లేకపోయింది. క్లైమాక్స్ సినిమాటిగ్గా సాగిపోతుంది. హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులు అంటూ పెద్దగా ఏమీ లేవు. ఒక కమర్షియల్ సినిమాలో ఎలా అయితే హీరో తేలిగ్గా విలన్ పని పట్టేస్తాడో ఇందులోనూ అలాగే చేయడం నిరాశ పరుస్తుంది. విలన్ హీరోకు సరైన ఛాలెంజ్ ఏమీ విసరడు. అన్నీ హీరోకు అనుకూలంగా సాగిపోతాయి. ఇక్కడ ‘గరుడవేగ’ ఒకింత నిరాశ కలిగిస్తుంది. ఐతే ఓవరాల్ గా ‘గరుడవేగ’ ఓకే అనిపిస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఎక్కుతుందా అన్నది సందేహే కానీ.. స్పై థ్రిల్లర్లు ఇష్టపడేవాళ్లు కచ్చితంగా చూడదగ్గ సినిమా. రాజశేఖర్ నుంచి ఇలాంటి సినిమాను ఊహించలేం. ఇది కచ్చితంగా ఆయనకు కమ్ బ్యాక్ మూవీనే అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

చాన్నాళ్ల తర్వాత వెండి తెరపై కనిపించిన రాజశేఖర్ ను మొదట చూసినపుడు కొంచెం ఇబ్బంది పడతాం. ఆయన లుక్ కొంచెం తేడా కొట్టినట్లుగా అనిపిస్తుంది. కొంతసేపటికి అలవాటు పడతాం. ఐతే పెర్పామెన్స్ పరంగా రాజశేఖర్ అదరగొట్టాడు. సీరియస్ పోలీస్ క్యారెక్టర్లో తనదైన శైలిలో నటించి మెప్పించాడు రాజశేఖర్. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. హీరోయిన్ పూజా కుమార్ ది లిమిటెడ్ రోల్. ఆమె ఓకే అనిపిస్తుంది. కీలక పాత్రలో ఆదిత్ బాగా చేశాడు. విలన్ కిషోర్ లుక్స్ అవీ బాగున్నాయి కానీ.. అతడి పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు. రాజశేఖర్ టీం సభ్యులుగా నాజర్.. రవి వర్మ.. చరణ్ దీప్ ఆకట్టుకుంటారు. పోసాని.. ఆలీ చిన్న చిన్న పాత్రలు చేశారు. వాళ్లు పర్వాలేదు.

సాంకేతికవర్గం:

శ్రీచరణ్ పాకాల-భీమ్స్ కలిసి అందించిన సంగీతం పర్వాలేదు. ఇందులో ఉన్నవి రెండు పాటలే. అవి జస్ట్ ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం చాలా బాగుంది. థ్రిల్లర్ సినిమాలకు సరిగ్గా సూటయ్యే ఆర్.ఆర్ ఇచ్చారు. సన్నివేశాల్ని మంచి ఫ్లోతో నడిపించడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. అంజి ఛాయాగ్రహణం నిలకడగా సాగలేదు. కొన్ని సన్నివేశాల్లో గొప్పగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం గందరగోళంగా అనిపిస్తుంది. ఆరంభంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లో ఈ గందరగోళం ఎక్కువగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాకు అవి ప్రత్యేక ఆకర్షణ. మార్కెట్.. బిజినెస్ గురించి పట్టించుకోకుండా ఇలాంటి కథకు సపోర్ట్ చేయడం.. రాజీ పడకుండా భారీ ఖర్చుతో సినిమాను నిర్మించినందుకు నిర్మాత అభినందనీయుడు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఇందుకు టెక్నీషియన్లను అభినందించాలి. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఒక కన్విక్షన్ తో సినిమా తీశాడు. ప్రపంచ స్థాయి థ్రిల్లర్ మూవీ అందించాలనే అతడి తపన సినిమాలో కనిపిస్తుంది. ఐతే కొన్ని చోట్ల వావ్ అనిపించే ప్రవీణ్.. కొన్ని చోట్ల మాత్రం ఆ స్థాయిని మెయింటైన్ చేయలేకపోయాడు. కథ కొంచెం సింపుల్ గా అనిపించినా.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సినిమాను నడిపించాడు ప్రవీణ్. అతను అక్కడక్కడా కొన్ని వృథా సన్నివేశాల్ని పరిహరించి.. కొంచెం నిడివి తగ్గించి.. ద్వితీయార్ధాన్ని మరింత పకడ్బందీగా తీర్చిదిద్ది ఉంటే ‘గరుడవేగ’ స్థాయి వేరుగా ఉండేది.

చివరగా: గరుడవేగ.. ఎంగేజింగ్ స్పై థ్రిల్లర్



రేటింగ్స్ :

123telugu - Rating : 3.25/5

Gulte - Rating : 3/5

Telugu Mirchi - Rating :2.75 /5

 Indiaglitz - Rating : 3.3/5

Tupaki - Rating : 2.75/5

Mirchi9 - Rating : 2.75/5

Chitramala - Rating : 3/5


Share:

నెక్స్ట్ నువ్వే మూవీ రివ్యూ & రేటింగ్స్

నెక్స్ట్ నువ్వే మూవీ రివ్యూ & రేటింగ్స్






చిత్రం:‘నెక్స్ట్ నువ్వే’

నటీనటులు: ఆది సాయికుమార్ - వైభవి - రష్మి గౌతమ్ - బ్రహ్మాజీ - జయప్రకాష్ రెడ్డి - అవసరాల శ్రీనివాస్ - రఘు కారుమంచి తదితరులు
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
సంగీతం: సాయికార్తీక్
నిర్మాణం: వీ4 క్రియేషన్స్
కథ: డీకే
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రభాకర్

చిన్న సినిమాల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అల్లు అరవింద్ సారథ్యంలో మొదలైన కొత్త బేనర్ ‘వీ4 క్రియేషన్స్’. ఈ బేనర్లో తెరకెక్కిన తొలి సినిమా ‘నెక్స్ట్ నువ్వే’. టీవీ హోస్టుగా - నటుడిగా పేరు సంపాదించిన ప్రభాకర్ దర్శకుడిగా మారి తొలిసారి తెరకెక్కించిన సినిమా ఇది. తమిళ హిట్ మూవీ ‘యామిరుక్క భయమే’కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో ఆది-వైభవి జంటగా నటించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హార్రర్ కామెడీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కిరణ్ (ఆది) రూ.50 లక్షలు అప్పు చేసి ఓ సీరియల్ తీస్తాడు. కానీ పైసా వెనక్కి రాదు. అప్పు తీర్చలేక సతమతమవుతున్న అతడికి అరకులో తన పేరిట ఒక బంగ్లా ఉన్న సంగతి తెలుస్తుంది. ఎలాగోలా ఇంకో రూ.50 లక్షలు సంపాదించి.. ఆ డబ్బుతో బంగ్లా బాగు చేయించి దాన్నో రిసార్టుగా మారుస్తాడు ఆది. తన ప్రేయసి.. ఇంకో ఇద్దరితో కలిసి ఆ రిసార్ట్ నడపడానికి ఏర్పాట్లు చేసుకుంటాడతను. ఐతే ఆ రిసార్టుకు వచ్చిన వాళ్లు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఆ బంగ్లాలో దయ్యం ఉందన్న భయం మొదలవుతుంది. ఇంతకీ వాళ్లందరూ ఎందుకు చనిపోవడానికి కారణమేంటి.. నిజంగానే ఆ బంగ్లాలో దయ్యం ఉందా.. అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

కొత్త టాలెంటుకు అవకాశమిస్తూ.. కొత్త తరహా.. కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ చేయడానికే ‘వీ4 క్రియేషన్స్’ అనే కొత్త బేనర్ పెట్టినట్లుగా చెప్పారు అల్లు అరవింద్. కాబట్టి ఈ బేనర్లో తెరకెక్కిన తొలి సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆశించారు ప్రేక్షకులు. కానీ ఆ ప్రత్యేకత కోసం సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు నిరీక్షిస్తూనే ఉంటాం. కానీ ఎక్కడా ఏ విశేషం కనిపించదు. ఇది ఏ ప్రత్యేకతా లేని ఒక సాదాసీదా హార్రర్ కామెడీ. ఇందులో జానర్ కు న్యాయం చేసే అంశాలు కూడా పెద్దగా లేకపోవడం ఆశ్చర్యకరం. హార్రర్ ఫ్యాక్టర్ పూర్తిగా తేలిపోగా.. అక్కడక్కడా ఓ మోస్తరుగా అనిపించే కామెడీ కొంచెం ఎంగేజ్ చేస్తుంది. కానీ అది కూడా పూర్తి స్థాయిలో పండలేదు.

‘నెక్స్ట్ నువ్వే’.. ‘యామిరుక్క భయమే’ అనే తమిళ హార్రర్ కామెడీ మూవీకి రీమేక్. ఈ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయింది. అప్పటికేమైనా ఈ సినిమా తమిళ ప్రేక్షకులు కొత్తగా అనిపించిందేమో కానీ.. ఇప్పుడొచ్చిన దీని రీమేక్ మాత్రం ఔట్ డేటెడ్ అనిపిస్తుంది. ఇందులో స్ట్రైకింగ్ గా అనిపించే అంశాలేమీ లేవు. సిల్లీగా అనిపించే కథ.. అందుకు తగ్గట్లే సాగే కథనం.. ఏ దశలోనూ ప్రేక్షకుల్ని సీరియస్ గా సినిమాలో ఇన్వాల్వ్ కానివ్వవు. లైట్ హార్టెడ్ కామెడీ పండించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం చాలా ‘సిల్లీ’గా తయారైంది. సినిమా ఆద్యంతం ఈ సిల్లీనెస్ కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపూ అసలు ఏం ఉందని దీన్ని తమిళం నుంచి పట్టుకొచ్చారనే సందేహం వెంటాడేలా సాగుతుంది ‘నెక్స్ట్ నువ్వే’.

మొన్నే ‘రాజు గారి గది-2’ అనే హార్రర్ కామెడీ మూవీ వచ్చింది. అందులో ముగ్గురు కుర్రాళ్లు కలిసి రిసార్ట్ మొదలుపెట్టి వ్యవహారాలు నడుపుతుంటే అది రిసార్టే అన్న నమ్మకం కలుగుతుంది. కానీ ‘నెక్స్ట్ నువ్వే’లో మాత్రం జన సంచారమే లేనిచోట పాడుబడ్డట్లు కనిపించే ఒక బూత్ బంగ్లాకు రంగులేసి రిసార్ట్ అంటారు. ఇదే నమ్మశక్యంగా లేదంటే.. ఈ రిసార్టుకు వచ్చిన వాళ్లు వచ్చినట్లే చాలా సిల్లీగా చనిపోతుంటారు. ఇలా ప్రాణాలు పోతుంటే ఈ రిసార్టు యజమాని.. అతడి సహచరులు అసలేమీ జరగనట్లే సింపుల్ గా వాళ్లను తీసుకెళ్లి పాతి పెట్టేస్తుంటారు. వారిలో ఎలాంటి ఫీలింగ్ కానీ.. భయం కానీ కనిపించవు.

ఈ మరణాల మతలబు వెనుక ఏదైనా కావచ్చు.. కానీ అలా ప్రాణాలు పోయినపుడు తెరమీద కనిపించే పాత్రల నుంచి సీరియస్ రెస్పాన్స్ ఉండాలని ఆశిస్తాం. ఐతే ‘నెక్స్ట్ నువ్వే’లో అలాంటిదేమీ కనిపించదు. దీని వల్ల ప్రేక్షకులు ఏ దశలోనూ సినిమాను సీరియస్ గా తీసుకోరు. హార్రర్ కామెడీ కాబట్టి ఏమైనా చెల్లిపోతుందని లాజిక్ తో సంబంధం లేకుండా కథను నడిపించారు. ఈ విషయంలో మరీ ఎంత శ్రుతి మించారంటే యవ్వనంలో అవసరాల శ్రీనివాస్ ను చూపించి.. వయసు మళ్లే సరికి అదే వ్యక్తిని ఎల్బీ శ్రీరాంగా చూపిస్తారు. ఇందులో లాజిక్ ఏంటో మరి.

‘నెక్స్ట్ నువ్వే’లో ప్రేక్షకుల్ని కొంతమేర ఎంగేజ్ చేసేది బ్రహ్మాజీ కామెడీ మాత్రమే. బ్రహ్మాజీని సరిగ్గా వాడుకుంటే కామెడీ బాగా పండించగలడనిఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అతడి పాత్ర కనిపించినపుడల్లా కాస్తో కూస్తో నవ్వులు పండుతుంటాయి. మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా బ్రహ్మాజీ పాత్ర వరకు ఫన్ వర్కవుట్ అయింది.రష్మి సెక్సీగా కనిపిస్తూ మాస్ ప్రేక్షకుల్ని కొంత మేర ఎంగేజ్ చేస్తూ సాగుతుంది. కానీ ఆ పాత్రను ఎందుకు పెట్టారని మాత్రం అడగకూడదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమంత ఆసక్తికరంగా లేదు. సినిమాలో హార్రర్ ఫ్యాక్టర్ కూడా తేలిపోయింది. మొత్తంగా చూస్తే ‘నెక్స్ట్ నువ్వే’ కొత్తదనం.. లాజిక్ లేకుండా సాగే ఒక మామూలు హార్రర్ కామెడీ.

నటీనటులు:

ఆదికి నటుడిగా గుర్తింపునిచ్చే సినిమా కాదిది. చాలా మామూలు పాత్ర అతడిది. అతను ఈజీగానే లాగించేశాడు. హీరోయిన్ వైభవి ఏ రకంగానూ ఆకట్టుకోదు. ఆమెఅందంగానూ లేదు. నటనా అంతంతమాత్రమే. అందరిలోకి బ్రహ్మాజీ ఒక్కడు బాగా ఎంగేజ్ చేశాడు. అతడి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. రష్మి గౌతమ్ వ్యాంప్ తరహా పాత్రలో సెక్సీగా కనిపించింది. చిన్న పాత్రలో అవసరాల శ్రీనివాస్ పర్వాలేదు. జయప్రకాష్ రెడ్డి.. రఘు కారుమంచి.. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘నెక్స్ నువ్వే’ ఏమంత గొప్పగా అనిపించదు. సాయికార్తీక్ పాటలు ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. కార్తీక్ పళని ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. అల్లు అరవింద్ భాగస్వామ్యం ఉన్న సినిమా అయినా.. ఆయన స్థాయికి తగ్గ నిర్మాణ విలువలు ఇందులో కనిపించవు. అన్ని హార్రర్ కామెడీల్లాగే ఇది కూడా ఒకే ఒక బంగ్లాలో చుట్టేశారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా గ్రాండియర్ ఏమీ కనిపించదు. ఇక దర్శకుడు ప్రభాకర్.. తమిళ సినిమాతో పోలిస్తే చాలా మార్పులు చేసినట్లు చెప్పాడు కానీ.. అలా ఏమీ కనిపించదు. చాలా వరకు మాతృకనే ఫాలో అయిపోయాడతను. రచయితగా కానీ.. దర్శకుడిగా కానీ అతడి ముద్రంటూ ఏమీ కనిపించదు. కొన్ని కామెడీ సీన్లు.. డైలాగుల వరకు పర్వాలేదనిపించాడు.

చివరగా: నెక్స్ట్ నువ్వే.. బోరింగ్ హార్రర్ కామెడీ

రేటింగ్స్ :

123telugu - Rating :2.75 /5

Telugu Mirchi - Rating :2.5 /5


Tupaki - Rating : 2.25/5


Chitramala - Rating : 2.5/5







Share:

Categories

Sample Text

ALL AT SITE is web site where you can find and download content

Pages