హెచ్‌పీసీఎల్‌లో 122 పోస్టులు

హెచ్‌పీసీఎల్‌లో 122 పోస్టులు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్).. ముంబై రిఫైనరీలో 122 నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ ఖాళీల భర్తీకి ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


ఖాళీల వివరాలు : 

అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్-67, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్-6, అసిస్టెంట్ లేబొరేటరీ అనలిస్ట్-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (మెకానికల్)-9, ఫైల్ ఆపరేటర్-19.

విద్యార్హతలు:

పోస్టులను బట్టి బీఎస్సీ కెమిస్ట్రీ/ఎస్‌ఎస్‌సీ+బాయిలర్ అటెండెంట్ కాంపెటెన్సీ సర్టిఫికెట్/డిప్లొమా (ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/మెకానికల్)/ఇంటర్మీడియెట్+బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్సులో సర్టిఫికెట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

వయసు: 

2018, అక్టోబర్ 1 నాటికి 18-25 ఏళ్లు.

ఎంపిక విధానం:

 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్‌టెస్ట్. సీబీటీలో జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 

దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: http://hindustanpetroleum.com

source : sakshi news
Share:

ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో 21 ఉద్యోగాలు

ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో 21 ఉద్యోగాలు


భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే 2018-19కి గాను 21 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు..

విభాగాల వారీ ఖాళీలు: అథ్లెటిక్స్ (మెన్)-1, ఆక్వాటిక్ (మెన్)-1, బ్యాడ్మింటన్ (మెన్)-2, బాల్ బ్యాడ్మింటన్ (మెన్)-1, బాక్సింగ్ (మెన్)-1, బాక్సింగ్ (ఉమెన్)-1, ఫుట్‌బాల్ (ఉమెన్)-2, గోల్ఫ్ (మెన్)-1, హాకీ (మెన్)-2, కబడ్డీ (ఉమెన్)-2, టేబుల్ టెన్నిస్ (మెన్)-2, వాలీబాల్ (మెన్)-2, వాలీబాల్ (ఉమెన్)-1, వెయిట్ లిఫ్టింగ్ (మెన్)-1, వెయిట్ లిఫ్టింగ్ (ఉమెన్)-1. 

అర్హత: పదో తరగతితో పాటు ఐటీఐ, పన్నెండో తరగతి, షార్ట్ హ్యాండ్ (ఇంగ్లిష్/హిందీ), గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత క్రీడలో ప్రతిభ ఉండాలి. 

వయసు: 2019, జనవరి 1 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. 

దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.250). 

దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 29, 2018. 

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: www.eastcoastrail.indianrailways.gov.in

Post source : సాక్షి

Share:

అప్లికేషన్‌ రిజెక్టెడ్‌.. కారణం ఏమిటో తెలుసా...!

అప్లికేషన్‌ రిజెక్టెడ్‌.. కారణం ఏమిటో తెలుసా...!

అర్హతలకు తగిన ఉద్యోగానికి నోటిఫికేషన్‌ వెలువడింది. దరఖాస్తు దశలోనే రిజెక్టెడ్‌ అనే మెయిల్‌ వచ్చింది. చాలా కంపెనీలు తిరస్కరణకు కారణాలు కూడా చెప్పవు. ఇంటర్వ్యూకు కూడా పిలవకుండా ఎలా తిరస్కరించారబ్బా అంటూ అప్పుడు మల్లగుల్లాలు పడటం తప్ప చేసేది ఏమి ఉండదు. అసలు దరఖాస్తు దశలోనే ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుంటే మంచిది కదా!

 

బ్లాగుతో అంతా కాదు

దరఖాస్తు ఎలా నింపాలో చెప్పడానికి ఇప్పుడు బోలెడు వెబ్‌సైట్‌లు, బ్లాగులు, అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు పూర్తి చేయడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర లేదు. అయితే వీటితో త్వరగా పని పూర్తి చేయొచ్చు అనుకుంటే బుట్టలో పడినట్లే. అవన్నీ మనకోసమే ఉన్నాయనే భ్రాంతిలో ఉండొద్దు. అలాంటి బ్లాగులో నుంచి మనకు నప్పింది తీసుకుని, అవసరానుగుణంగా కొద్దిగా పాలిష్‌ చేసి, మెయిల్‌ చేస్తే సరిపోతుంది అనుకోవద్దు. చాలా సందర్భాల్లో అవి అభ్యర్థి అంతరంగానికి అద్దంపట్టకపోవచ్చు. ఈ బ్లాగులు, సైట్లు రెజ్యూమె నింపేందుకు దారి చూపుతాయే తప్ప మనల్ని గమ్యానికి చేర్చవు. హైరింగ్‌ మేనేజర్‌కు మీరు చెప్పాల్సింది చేరదు. ఫలితంగా కనీసం ఇంటర్వ్యూకి పిలుపు అందదు.

 

సంక్షిప్తత ముఖ్యం

దరఖాస్తు ఎ4లో రెండు పేజీల వరకు ఉండొచ్చని ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. అదే నమ్ముతూ సమస్త సమాచారాన్ని ఆ రెండు పేజీల్లోనే కూరడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి అనవసర సోది విషయాలను పక్కకు పెట్టి, బోర్‌ కొట్టించకుండా అసలు సంగతులను చక్కగా పేర్చగలిగితేనే దరఖాస్తు ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు టెన్నిస్‌ క్రీడలో ప్రావీణ్యం ఉంటే ఆటకు సంబంధించిన పది పాఠాలు మొదటి పేజీలో చెప్పి, మీ సామర్థ్యం ఎక్కడో చెపితే ఉపయోగం ఉండదు. అది రిక్రూటర్‌ దరి చేరదు. నిజంగా చెప్పగలిగిన విషయాలు ఉంటే రెండు దాటినా పర్వాలేదు. అయితే చాలామంది ప్రింటవుట్‌ అందజేసే సమయంలో చివరి పేజీలను జత చేయడం మర్చిపోతుంటారు. అక్కడ జాగ్రత్తలు పాటిస్తే బెటర్‌.

 

సూచనలను పాటించాలి

జాబ్‌ ప్రకటనలో చేసిన సూచనలను ఎక్కువ మంది పాటించరు. ఫలానా విధంగానే దరఖాస్తు చేసుకోవాలని లేదా తమకు అవసరమైనవి ఆ కొద్ది విషయాలు మాత్రమేనని ప్రకటనలోనే కచ్చితంగా చెప్పినప్పుడు అవి పాటించి తీరాల్సిందే. అందుకు తగ్గట్టుగానే దరఖాస్తు ఉండాలి. జాబ్‌ ప్రకటనలో ఎలాంటి నిబంధనలు లేనిపక్షంలో మనకు నచ్చిన విధంగా దరఖాస్తును రూపొందించుకునే వెసులుబాటు లభిస్తుంది. అందువల్ల జాబ్‌ ప్రకటనను క్షుణ్ణంగా చదవాలి. అప్పుడే మనకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న సంగతులు తెలుస్తాయి.

 

ఒకే కంపెనీకి పదేపదే

ఒక కంపెనీలో పలు ఉద్యోగాలకు మీరు అర్హులే కావచ్చు. అంతమాత్రాన ఆ కంపెనీ ప్రకటన ఇచ్చిన ప్రతీ జాబ్‌కు దరఖాస్తు చేయకూడదు. ఉద్యోగాలు వేర్వేరు అయినప్పటికీ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారాలు చూసే టీమ్‌ ఒకటే ఉంటుంది. ఈ రోజుల్లో అన్నీ వెబ్‌ ఆధారిత దరఖాస్తులే. పేరు కొట్టగానే అభ్యర్థి ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడో తెలిసిపోతుంది. ఇది అభ్యర్థుల ఆందోళనను బయటపెడుతుంది. ఏదో ఒక రంగం పట్ల అతని ఆసక్తిని వ్యక్త పరచదు, అభ్యర్థికి కెరీర్‌ పట్ల స్పష్టమైన అవగాహన లేదనే అభిప్రాయాన్ని కలుగజేస్తుంది.

 

సరళత ముఖ్యం

దరఖాస్తులో టైపింగ్‌ తప్పులు పెద్ద విషయం కాదని చాలా మంది అభ్యర్థులు భావిస్తుంటారు. రెండు మూడు పర్యాయాలు దరఖాస్తు మొత్తం చదువుకున్నప్పటికీ ‘సెండ్‌’ బటన్‌ కొట్టే సమయంలో కూడా ఏదో ఒక తప్పు కనిపిస్తుంది. అంతే కాదు అన్‌ ప్రొఫెషనల్‌గా ఉండే ఉదాహరణలు, పదాలు కూడా సీవీల్లో దొర్లుతుంటాయి. ఇలాంటి వాటిని రిక్రూటర్లు సీరియస్‌ విషయంగా పరిగణిస్తారు.

 

పంచ్‌ కవర్‌ లెటర్‌

సుదీర్ఘంగా, పదేపదే దొర్లే పదాలతో కవరింగ్‌ లెటర్‌ రాయ వద్దు. ప్రతి జాబ్‌కు వందలాది దరఖాస్తులు వస్తున్న రోజులివి. ఒకే రకమైన భావం, పదాలతో కూడిన దరఖాస్తులు హైరింగ్‌ మేనేజర్లు రోజూ చూసి విసుగెత్తి ఉంటారు. పంచ్‌ పదాలు, భిన్నంగా ఉన్నవి రిక్రూటర్లను ఆకట్టుకుంటాయి. ఇవే మిగిలిన వారినుంచి భిన్నంగా నిలబెడతాయి. ఉద్యోగంలో కలిగిన ఏదో ఇబ్బందిని మీరు ఎలా సులువుగా పరిష్కరించారు, ఇతరుల కంటే ముందే సదరు ఉద్యోగానికి అవసరమైన టెక్నాలజీని మీరు ఎలా అందిపుచ్చుకున్నారు తదితరాలు రిక్రూటర్‌ను ఆకట్టుకుంటాయి. కవరింగ్‌ లెటర్‌ అంటే ఒక ఐదారు వందల పదాలతో రాయవద్దు. మూడు చిన్ని పేరాలు ఉంటే చాలు. సైజు పెరుగుతున్న కొద్దీ చెత్తబుట్టలోకి చేరడానికి దగ్గరవుతున్నట్లు లెక్క.

Post sources : ఆంధ్రజ్యోతి

Share:

ఫేక్ జాబ్ ఆఫర్స్ ను గుర్తించండిలా.......

ఫేక్ జాబ్ ఆఫర్స్ ను గుర్తించండిలా.......

కొన్ని సందర్భాల్లో మనం దరఖాస్తు చేయని కంపెనీ నుంచి, మన అర్హతలకు సంబంధం లేని జాబ్‌లకు ఆఫర్‌ లెటర్‌లు వస్తుంటాయి. ఇలాంటివి నిజమని నమ్మి వారిని సంప్రదించామో అంతే సంగతులు. వారి వలలో చిక్కినట్లే. ఇలాంటి ఫేక్‌ ఆఫర్లను ఎలా గుర్తించాలో చూద్దాం.

 

మోసపూరితమైన ఈ మెయిళ్ళలో జాబ్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఉండదు. కంపెనీ, ప్యాకేజ్‌, జాబ్‌లో భాగంగా నిర్వర్తించాల్సిన పాత్ర, విధులు వంటి వివరాలు ఏమీ ఉండవు. అస్పష్టత అంతకుమించి సందిగ్ధత కనిపిస్తుంది.

 

డబ్బులు అడిగారంటే అది ఫేక్‌ కాల్‌ అని చెప్పుకోవచ్చు. బాధ్యతాయుతంగా ఉండే కంపెనీలు ఏవీ డబ్బులు అడగవు. ఆఫర్‌కు ముందే బాండ్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ ఇబ్బంది పెట్టవు.

 

స్థాయుల్లో పైనించి కిందికి జాబ్‌ ఏదైనప్పటికీ సంబంధిత సమాచారం ఎక్కువమంది అందుబాటులో ఉండేందుకు కంపెనీలు ప్రయత్నం చేస్తాయి. అర్హులను ఎంపిక చేసుకునేందుకు వీలుగా వివిధ రూపాల్లో జాబ్‌ సమాచారాన్ని తెలియజేస్తాయి. రిఫరల్‌, యాడ్స్‌ తదితరాలు అన్నమాట.

 

తప్పుడు ఆఫర్లకు సంబంధించిన ఈమెయిళ్ళన్నీ సాధారణంగా స్పామ్‌ ఫోల్డర్‌లోకి చేరుతుంటాయి. వీటిని ఒకేసారి పెద్దఎత్తున పంపండంతో అందులోకి చేరతాయి. నిజమైన ఆఫర్లు ఎప్పుడు వేల సంఖ్యలో బల్క్‌గా పంపరు.

 

మెయిలు ఎక్కడి నుంచి వచ్చిందీ తెలియని విధంగా ఆఫర్లు ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప గుర్తించలేరు. ఉదాహరణకు '@abc.-com' ఇలా ఉంటాయి. జీమెయిల్‌, యాహూ మెయిల్‌, హాట్‌మెయిల్‌ నుంచి జాబ్‌ ఆఫర్లను కంపెనీలు పంపవు. టిసిఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌... ఇలా కంపెనీ ఐడినే వాడతారు.

 

మోసపూరిత ఆఫర్‌ లెటర్లలో ఎక్కువ స్పెల్లింగ్‌ నుంచి వ్యాకరణ తప్పిదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అర్థపర్థం లేని వాక్యాలతో గజిబిజిగా కూడా ఉంటాయి.

 

పుట్టిన రోజు, సోషల్‌ సెక్యూరిటీ నెంబరు, ఇతర వ్యక్తిగత వివరాలు అడిగిన పక్షంలో ఆ ఆఫర్‌ను నమ్మడానికి వీల్లేదు. వీటిలో కొన్ని అడిగినప్పటికీ రెండో దశలో ఉంటుంది. ఒక స్థాయిలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల నేపథ్యం తెలుసుకునేందుకు కొంత మేర వ్యక్తిగత సమాచారం అడగటం మామూలే.

 

ఫేక్‌ ఆఫర్లు పంపే కంపెనీలు చాలా వరకు పేరున్న కంపెనీల పేర్లను, లోగోలను కాపీ కొడతాయి. ఒకటి రెండు అక్షరాల తేడాతో తప్పుదోవ పట్టిస్తాయి. సూక్ష్మంగా చూస్తే తప్ప ఈ తేడాను అర్థం చేసుకోలేం.

 

ఇంటర్నెట్‌ విజృంభణతో సమస్త పనులూ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం మొదలుకుని, ఆఫర్లను అందుకోవడం కూడా మెయిల్స్‌ ద్వారానే జరుగుతోంది. ఇదే అదనుగా కొంతమంది తప్పుడు ఆఫర్లను పంపి అభ్యర్థులను మోసం చేస్తున్నారు. అలాంటి ఫేక్‌ ఆఫర్లను ఎలా గుర్తించాలో చెబుతున్నారు ఇండస్ట్రీ నిపుణులు.

 

తప్పుదారి పట్టించేదగా అనిపించినా, అనిపించకున్నా సదరు కంపెనీకి సంబంధించిన వివరాలు, అందులో అసలు అలాంటి ఉద్యోగాలు ఉన్నాయా లేదా అనే విషయాల కోసం నెట్‌లో పరిశోధన చేయడం ఉత్తమం. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి.

Post source : ఆంధ్రజ్యోతి

Share:

అన్ని ఇంటర్వ్యూలు పద్ధతిగా ఉండవు!

అన్ని ఇంటర్వ్యూలు పద్ధతిగా ఉండవు!

ఇంటర్వ్యూలు అంటే ఒక పద్ధతిగా జరుగుతాయని, గదిలోకి వెళ్లగానే సుహృద్భావ వాతావరణం ఉంటుందని, అభ్యర్థులను కేవలం సబ్జెక్టు లేదా వ్యక్తిగత ప్రశ్నలు మాత్రమే అడుగుతారని చాలా మంది భావిస్తుంటారు. ఇంటర్వ్యూకు వచ్చిన వ్యక్తులందరినీ సరిగా అంచనావేసి ఉద్యోగం ఇస్తారు అనుకుంటుంటారు. ఇది పాక్షిక నిజం. అన్ని ఇంటర్వ్యూలు పద్ధతిగా ఉండకపోవచ్చు. నిర్వహణలో గందరగోళం కూడా ఉండవచ్చు. ఇలాంటి వాటిపై ముందే అవగాహన ఉంటే అభ్యర్థి అప్పటిప్పుడు అందుకు అనుగుణంగా మారిపోవచ్చు. ఏ విషయాలు ఇబ్బందిపెడతాయో తెలుసుకుంటే, జాగ్రత్తపడవచ్చు.

 

పద్ధతి లేకపోవడం

విధాన రహిత లేక ఏకీకృత విధాన ఇంటర్వ్యూ. ఇలాంటి వాటి నుంచి ఫలితాలను ఆశించలేం. ఉదాహరణకు కంపెనీ పెద్దదే కావచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా దాని బ్రాంచ్‌ల్లో రిక్రూట్‌మెంట్‌కు ఒకటే విధానం అనుసరిస్తే గందరగోళం ఏర్పడవచ్చు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రోగ్రామర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఒకే తీరుగా ఉండొచ్చు. అయితే అదే ఆఫీసులో పనిచేసే సపోర్టింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌కు ఈ సూత్రం వర్తించదు. స్థానికంగా పరిస్థితులు ముఖ్యంగా సంస్కృతి, చట్టాల ఆధారంగా వీటిని రూపొందించుకోవాల్సిందే. అందుకు అనుగుణంగా ఇంట ర్వ్యూ విధానాలనూ అమలు చేసుకుంటేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

 

టైమింగ్‌

పైకి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఇంటర్వ్యూ జరిగే సమయం కూడా ఫలితాన్ని నిర్ణయిస్తుందనేది నిజం. ఇంటర్వ్యూ సమయం గడుస్తున్న కొద్దీ ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకు, హాజరయ్యే వ్యక్తులకు ఎనర్జీ లెవెల్స్‌ తగ్గుతూ వస్తుంటాయి. వరుసగా ఐదారు ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తికి, మధ్యలో విరామం తీసుకుని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మొదటి దానికంటే రెండో విషయంలో ఫలితం యాక్యురేట్‌గా ఉండే అవకాశం ఎక్కువ. ఫస్టవర్‌లో జరిగే ఇంటర్వ్యూకి, ఈవెనింగ్‌ అంటే ఆఫీస్‌ క్లోజింగ్‌ అవర్స్‌లో ఇంటర్వ్యూ చేయడానికి కూడా తేడా ఉంటుంది. అయితే ఇవన్నీ అభ్యర్థి చేతిలో ఏమీ ఉండవు. అందుకే పాజిటివ్‌గా ఉండడమే చేయాల్సింది.

 

ఇంటర్వ్యూ నిడివి

చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు చాలా షార్ట్‌గా ఉంటాయి. మేనేజర్‌ స్థాయి వ్యక్తుల సమయం, పని ఒత్తిడులు ఇందుకు దోహదం చేస్తాయి. దాంతో వాస్తవిక అసె్‌సమెంట్‌ జరగడానికి ఆస్కారం తక్కువ. సమయాన్ని మేనేజ్‌ చేసుకోవడానికి వీరు ఫస్ట్‌ ఇంప్రెషన్‌పైనే ఆధారపడతారు. అవి అంత కచ్చితంగా ఉండక పోయే అవకాశం కూడా ఉంది. అలా అని ఎక్కువ సమయం ఇంటర్వ్యూ జరిగిన వ్యక్తులు ఆనందంగా ఉంటారని కాదు. అనవసర ప్రశ్నలతో సహనానికి పరీక్షలాగా కూడా ఉండొచ్చు. సమ యం తగ్గించడం, పెంచడం మన చేతుల్లో లేనందున రెంటికీ అభ్యర్థి సన్నద్ధం కావాలి.

 

ఇంటర్వ్యూ ఆర్డర్‌

ఎన్నో వ్యక్తిగా మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి హాజరవుతున్నారు అనేదానిని బట్టి కూడా కొన్ని సందర్భాల్లో ఫలితం ఆధారపడి ఉంటుంది. నిష్టూరమే అయినప్పటికీ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే మొదటి అభ్యర్థి ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలు తక్కువ. మొదటి గంటలో ఇంటర్వ్యూర్‌ అతి పర్ఫెక్షన్‌ కోసం ప్రయత్నించడం వల్ల ఇలా జరుగుతుంది.

 

లొకేషన్‌

ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం కూడా అభ్యర్థి ఎంపికలో ఇతోధిక పాత్ర పోషిస్తుంది. ఇది అన్ని ఇంటర్వ్యూలకు వర్తిస్తుందని చెప్పలేం. సమావేశాల గదిలో జరిగే ఇంటర్వ్యూ ఫలితాలు, లంచ్‌ ముఖాముఖి ఫలితాలకంటే మెరుగ్గా ఉండవచ్చు.

 

ఇన్‌పర్సన్‌

వ్యక్తిగత ఇంటర్వ్యూ అనేది కొంచెం ఖరీదైన వ్యవహారం. చాలా మంది వ్యక్తులు తమ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత వీడియో, ఆడియో ఇంటర్వ్యూలతో ఇదంతా సులువుగా మారింది. లైవ్‌ ఇంటర్వ్యూలతో ట్రావెల్‌ ఖర్చులు తగ్గడమే కాదు, నాణ్యత విషయంలోనూ రాజీపడాల్సిన అవసరం ఉండదు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు, వెబ్‌కామ్‌ ఇంటర్వ్యూల ఎంపికలో తేడా ఉంటుంది.

 

ట్రావెల్‌

కొన్ని పెద్ద పోస్టులకు జరిగే ఇంటర్వ్యూల్లో మరో ఇబ్బంది ఉంది. రాత్రి విమాన ప్రయాణం చేసిన తరవాత అంటే జెట్‌లాగ్‌ ప్రభావం చూపుతుంది. ఇది అభ్యర్థికి, ఇంటర్వ్యూయర్‌కూ అదే సమస్య. దీంతో ఎంపిక సరిగా జరగకపోయే అవకాశం ఎక్కువ.

 

పరిమిత సమయం

సరిపోయేంత సమయం ఇవ్వకుంటే అభ్యర్థి తనను తాను నిరూపించుకోలేడు, ప్రమోట్‌ చేసుకోలేడు.

 

నైపుణ్యాలు అవసరం లేని ఉద్యోగాలు

సాధారణంగా ఇంటర్వ్యూలు అభ్యర్థుల ఇంటర్‌ పర్సనల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పరీక్షించేలా ఉంటాయి. కొన్ని ఉద్యోగాలకు అలాంటి స్కిల్స్‌ అవసరం ఏమీ ఉండవు. ఇలాంటి ఉద్యోగాల్లోనూ స్కిల్స్‌ పరీక్షిస్తుంటారు.

 

ప్యానెల్‌ ఇంటర్వ్యూలు

ప్యానెల్‌ లేదంటే గ్రూప్‌ ఇంటర్వ్యూ ఎక్కువగా ఒత్తిడి ధోరణిలో ఉంటుంది. ఒకే అభ్యర్థిపై ప్యానల్‌ సభ్యులు ఒకరితరువాత మరొకరు, ఒకదాని తరువాత మరొకటి ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అభ్యర్థిని ఇబ్బందికి గురి చేసేలా, ప్రభావితం చేసేలా మాట్లాడుతారు. ప్యానల్‌ ఇంటర్వ్యూలలో పక్షపాతానికి అవకాశం ఉండదనే భావం అందరిలో వ్యక్తం అవుతుంటుంది. అయితే ఇంటర్వ్యూ టీమ్‌ను లీడ్‌ చేసే వ్యక్తి లేదా అందులో పాల్గొన్న వ్యక్తి ప్రభావవంతమైన వాడు అయినట్లయితే ఇతరులను తన దారిలో ఉండేలా చూసుకుంటాడు. అలాగే ఒక సబ్జెక్టుకు సంబంధించిన విషయాన్ని ఇంకో సబ్జెక్టు వ్యక్తి అడిగినట్లయితే అభ్యర్థి తికమకకు కూడా గురికావచ్చు. టెక్నికల్‌ మేనేజర్‌ అడగాల్సిన ప్రశ్న హ్యూమన్‌ రిసోర్స్‌ విభాగంలో పనిచేసే వ్యక్తి నుంచి రావచ్చు. ఒక్కోసారి గందరగోళం జరిగి అభ్యర్థి నిరాశ నిస్పృహలకు లోనుకావచ్చు. ఎలాంటి సందర్భంలోనైనా, ఎటు నుంచి మరెలాంటి ప్రశ్నలు వచ్చినా వాటిని ఎదుర్కొనే విధంగా ఉండడమే అభ్యర్థి చేయాల్సిన పని.

Post reference : ఆంధ్రజ్యోతి

Share:

Categories

Sample Text

ALL AT SITE is web site where you can find and download content

Pages