దీపావళి రోజున ఇలా చేయండి కుభేరులు అవ్వండి

దీపావళి రోజున ఇలా చేయండి కుభేరులు అవ్వండి.








భారతీయ సంప్రదాయాలలో కాలచక్రంలోని తెలుగు మాసాలలో ఆశ్వయుజ మాసానికి పర్వదిన విశిష్ఠత పేర్కొన దగినది. అశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటారు.కావాలంటే ఈ వీడియో చూడండి

ఈ రోజునఉదయమే లేచి అన్ని పనులు ముగించి , ప్రజలందరు గడ్డితో చేసిన బాణసంచాలోపల వుంచిన నరకాసురుని బొమ్మను ఆనందోత్సాహాలతో కాల్చి సాయంత్రం దైవసన్నిధిలో దీపారాధన చేస్తారు. నరకుని బొమ్మను మంటల్లో తగలేస్తారు.





కార్తికంలో దీపదానం చేయడం ఉత్తమమమైన క్రియ. తులసి చెట్టు దగ్గర, వాకిట్లో, దేవుని ముందు, దేవాలయంలో ఇలా దీపావళి పఠ్వదినాన ఎక్కడ దీపాల వరసలు పేర్చినా అధిక పుణ్యఫలం లభిస్తుంది.అసత్యం నుండి సత్యం, చీకటి నుండి వెలుగును, అజ్ఞానము జ్ఞానమును మృత్యువునుండి అమృతమును నాకు కల్గించమని ప్రార్థిస్తాం. ఆ జ్ఞాన దీపమునే, ఈ విశ్వానికి మొదట యిచ్చింది- వేద శబ్దములు. కనుక ఆ వేద శబ్దావళియే దీపావళి.






ఇక దీపావళి పర్వదినం అత్యుత్తమమైనది. ఈ రోజు లక్ష్మీ పూజ జరిపేరోజు. ఈ రోజు అమావాస్య అయినాకూడా ఎంతో విశిష్టమైన పర్వదినం. ఈ రోజున సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. తుల అంటే త్రాసు కాబట్టి అది ఎటూ మొగ్గక స్థిరంగా వుంటుంది. అంటే లాభనష్టాల ప్రస్తావన వుండని రోజు. ఈ రోజు ఎవరైనా, ఏదైనా నూతన వ్యాపారం ఆరంభిస్తే పలు రకాల లాభాలు సిద్ధిస్తాయని దృఢ విశ్వాసం.








భారతదేశంలో గుజరాత్-రాజస్థాన్-మహారాష్టల్రలో దీపావళితో కొత్త వ్యాపార సంవత్సరం ఆరంభమవుతుంది. ఉత్తర భారతంలో దీపావళినాడు మహలక్ష్మిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి పూజలు చేస్తారు. నువ్వుల నూనెతో జనులందరు తలంటు స్నానం చేయాలి. దీపావళి రోజుల్లో లక్ష్మీదేవి తిల తైలంలో వుంటుంది గాన తిల తైలంతో తలస్నానం లక్ష్మీప్రదమని పురాణోక్తి.











ఇక ఈరోజు చేసే పూజ సమయంలో శంఖం మరియు గంట అన్ని గదుల్లో మ్రోగించాలి.ఇలా చేస్తే ఇంట్లో ఉన్న అన్ని ద్రుష్ట శక్తులు,దరిద్రం భయటకు వెళ్ళిపోతుంది,లక్ష్మి దేవి ఇంట్లోకి వస్తుంది.దీపావళి రోజున నూనె దీపాలను వెలిగించాలి.ఒక నూనె దీపాన్ని వెలిగించి అందులో ఒక లవంగాన్ని వేసి దగ్గరలో ఉన్న హనుమాన్ దేవాలయం దగ్గరకి వెళ్లి హనుమంతునికి హారతి ఇవ్వండి.



దీపావళి రోజున శివునికి బియ్యం సమర్పించండి.బియ్యం వెలిగి ఉండకూడదు,అన్ని సంపూర్ణంగా ఉండాలి.పూజలో పసుపు రంగు గవ్వలు ఉంచండి.ఇలా చేస్తే లక్ష్మి దేవి తొందరగా ప్రసన్నం అవుతుంది.మీ ధన సంబంధిత సమస్యలు తీరుతాయి.పూజ సమయంలో పసుపు కుంకుమ కూడ పెట్టాలి.పూజ అయిపోయాక పసుపు కొమ్ముని మీరు డబ్బు దాచే చోట పెట్టాలి.











మీ దగ్గరలో లక్ష్మి దేవి గుడి ఉంటె వెళ్లి దీపావళి రోజు గులాబి సుగంధం కలిగిన అగరబత్తి లను దానం ఇవ్వాలి.దీపావళి రోజు అమావాస్య కాబట్టి రాగి చెట్టుకు నీరు పోయండి.ఇలా చేస్తే శని దోషం ,కాల సర్ప దోషం తొలిగిపోతాయి.పూజలో లక్ష్మి యంత్రం ,కుబెర యంత్రం ,శ్రీ యంత్రం తప్పక పెట్టాలి.రావి చెట్టు మొదట్లో నూనె దీపం వెలిగించి వెనుకకు తిరగకుండా రావాలి.ఒక పెద్ద దీపం వేసి దాని చుట్టూ తొమ్మిది నూనె దీపాలు పెట్టాలి.ఇలా చేస్తే లక్ష్మి దేవి మిమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తుంది, అంతా మంచే జరుగుతుంది..మీరూ అలాగే చేయండి మరి…
Share:

No comments:

Post a Comment

Categories

Sample Text

ALL AT SITE is web site where you can find and download content

Pages