దీపావళి రోజున మొదటి దీపం వెలిగేది ఇక్కడే.

దీపావళి రోజున మొదటి దీపం  వెలిగేది ఇక్కడే.






దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే దీపావళి వేడుకలు తొలుత ఈ ప్రాంతంలోనే ప్రారంభమవుతాయి. పురాతన కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. ఒక్క దీపావళే కాదు.. మరెన్నో పండుగలు ముందుగా ఇక్కడే ప్రారంభమవుతాయి. అదే మహాకాళీశ్వరుడు కొలువైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని. అనాదికాలంగా ఉజ్జయిని నగరంలో ఈ ఆచారం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా జరిగే దీపావళికి ఒకరోజు ముందుగానే మహాకాళి మందిరంలో వేడుకలు మొదలవుతాయి. ఆరోజు తెల్లవారుజామునే మహా హారతితో వేడుకలకు శ్రీకారం చుడతారు. తరువాత పండ్ల రసాలతో మహా‌కాళేశ్వరునికి ఘనంగా అభిషేకం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం మహాకాళేశ్వరునికి హారతి, అనంతరం భస్మహారతి, అన్నాభిషేకం నిర్వహించారు. దీపావళి సందర్భంగా ఉజ్జయిని నగరాన్ని ఎంతో అందంగా అలంకరించారు.




Share:

No comments:

Post a Comment

Categories

Sample Text

ALL AT SITE is web site where you can find and download content

Pages